వ్యక్తిపై నుంచి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

nanireddy
Updated on: 24 Dec 2018 3:33 PM IST
వ్యక్తిపై నుంచి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు
X

విజయవాడ కృష్ణ లంక హై వే పై ప్రమాదం చోటుచేసుకుంది. మహిళను తప్పించబోయి స్కూటీ మీద నుంచి కింద పడిన వ్యక్తి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చనిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అంబులెన్స్‌ కూడా సకాలంలో రాకపోవడంతో క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు బాలాజీ నగర్‌కి చెందిన వెంకటేశ్వర్‌రావుగా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం కారణంగా దాదాపుగా గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

nanireddy

nanireddy

Next Story