సీమంతం చేసుకుని పుట్టింటికి వెళ్తుండగా విషాదం

సీమంతం చేసుకుని పుట్టింటికి వెళ్తుండగా విషాదం
x
Highlights

పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలన్న పెద్దల దీవెనలు ముక్కోటి దేవతలకు కనిపించలేదు. మూడు కాలల పాటు పచ్చగా ఉండాలంటూ ముత్తైదువుల అక్షింతలు...

పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలన్న పెద్దల దీవెనలు ముక్కోటి దేవతలకు కనిపించలేదు. మూడు కాలల పాటు పచ్చగా ఉండాలంటూ ముత్తైదువుల అక్షింతలు జల్లుతూ ఇచ్చిన ఆశీస్సులు తథాస్తు దేవతలకు వినిపించలేదు. అమ్మ కాబోతున్న ఆనందం శ్రీమంతంతో రెట్టింపయ్యి గంటలు కూడా గడవక ముందే రోడ్డు ప్రమాదం కబళించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

గుంటూరుకు చెందిన వేజేండ్ల జయశ్రీ గర్భవతి కావడంతో తల్లిదండ్రులు ఘనంగా సీమంతం నిర్వహించారు. బంధువుల ఆటపాటలు, చిన్న పిల్లల ముద్దు ముచ్చట్ల మధ్య అంగరంగ వైభవంగా శ్రీమంతం నిర్వహించిన అనంతరం గుంటూరుకు వస్తుండగా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్‌ను జయశ్రీ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో గర్భిణీ జయశ్రీతో పాటు ఆమె తల్లి అనసూయమ్మ, మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో అప్పటి వరకు సందడి నెలకొన్న జయశ్రీ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం ఏర్పడింది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీగా విలపిస్తూ ఉండటం చూసి చుట్టుపక్కల వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories