logo
సినిమా

ఆర్జీవీ హోమోసెక్సువలా..?

ఆర్జీవీ హోమోసెక్సువలా..?
X
Highlights

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైర‌క్ట‌ర్ ఆర్జీవి తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్...

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైర‌క్ట‌ర్ ఆర్జీవి తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ). అయితే ఈ స్టోరీ త‌నదేనంటూ స‌ర్కార్ -3 ర‌చ‌యిత పి. జ‌య‌కుమార్ ఆరోపిస్తున్నారు. 2015 ఏప్రిల్ 1న ఈ స్క్రిప్టును తాను రాంగోపాల్ వర్మకు పంపానని..అయితే ఆ స్టోరీ న‌చ్చ‌క రిజ‌క్ట్ చేసిన‌ట్లు తెలిపారు. కానీ తాజాగా వ‌చ్చిన జీఎస్టీ ట్రైల‌ర్ చూసి షాక్ అయిన‌ట్లు తెలిపారు. ఆ స్టోరీ త‌న‌దేనంటూ కోర్టు మెట్లెక్కారు. ఈ నేప‌థ్యంలో ఆర్జీవీ హోమో సెక్స్ వ‌ల్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాలీవుడ్ హ్వార్వే వీన్ స్టీన్ ఎలాగో ఆర్జీవీ అంతేన‌ని అన్నారు. ఆర్జీవీ తో ప‌నిచేస్తే భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని ఊహించా. కానీ ఆయ‌న‌ స్వ‌లింగ సంప‌ర్క స్వ‌భావం క‌లిగిన వ్య‌క్త‌ని సూచించారు.
డైర‌క్ట‌ర్ లో ఉన్న ఈ కోణాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని లేదు. కానీ ఆ అవ‌స‌రం ఇప్పుడు వ‌చ్చింది అంటూ జయకుమార్‌ చేసిన కామెంట్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. వర్మ సర్కార్‌-3 సినిమాకు జయకుమార్ మాట్లాడుతు హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ 100కి పైగా మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డ్డాడు. ఆ దాడుల్ని నిర‌సించిన మ‌హిళ‌లు మీటూ క్యాంపెయిన్ తో బుద్ధొచ్చేలాచేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఆర్జీవీ లైంగిక దాడుల్ని వ్య‌తిరేకిస్తూ మీ టూ ఆర్జీవీ అనే కాంపెయిన్ నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వ‌ర్మ చేతిలో వేధింపుల‌కు గురైన క‌ళ‌కారులు ఈ కాంపెయిన్ లో పాల్గొనాల‌ని అన్నారు.
అయితే ర‌చ‌యి జయకుమార్‌ ఆరోపణల‌పై ఆర్జీవీ స్పందించారు. జ‌య‌కుమార్ దొంగ‌. ఏడెనిమిది నెల‌ల క్రితం మా ఆఫీస్ లో దొంగ‌త‌నం చేస్తే అత‌న్ని తొల‌గించామ‌ని .. అతని స్ర్కిప్ట్‌ను హ్యాక్‌ చేశాననడంలో నిజం లేదు’ అని రాంగోపాల్‌వర్మ పేర్కొన్నారు.

Next Story