logo
సినిమా

జీఎస్టీకి వ‌ర్మ డైర‌క్ట్ చేయ‌లేదా..?

జీఎస్టీకి వ‌ర్మ డైర‌క్ట్ చేయ‌లేదా..?
X
Highlights

ప్ర‌పంచంలో ఏ విష‌యాన్ని అయినా అర్ధం చేసుకోవ‌చ్చు . అర్ధం కాక‌పోతే ఒక‌టికి రెండు సార్లు బైహార్ట్ చేస్తే అర్ధం...


ప్ర‌పంచంలో ఏ విష‌యాన్ని అయినా అర్ధం చేసుకోవ‌చ్చు . అర్ధం కాక‌పోతే ఒక‌టికి రెండు సార్లు బైహార్ట్ చేస్తే అర్ధం అవుతుంది. కానీ డైర‌క్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మాట్లాడే మాట‌లు అస్స‌లు అర్ధం కావు. అస‌లు విష‌యానికొస్తే నిన్న సీసీఎస్ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన వ‌ర్మ‌ను పోలీసులు 3గంట‌ల పాటు విచారించి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.
1. జీఎస్టీని ఎందుకు తీసారు?

2. మాల్కోవాతో తీసిన వీడియోలో ఉన్న అభ్యన్తరకర సన్నివేశాలు ఎలా తీసారు

3. ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అస్లీళంగా చూపెట్టడం తప్పు దీనికి మీ సమాధానం

4. మీ పేస్ బుక్, ట్విటర్ లో మాల్కోవావి పెట్టిన ఫోటోలు ఎక్కడివి

5. టీవీల వేదికగా జరిగిన చర్చలో వైజాగ్ కు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్ అబ్యంతరకరమా కాదా

6. దేవితో మీరు పోర్న్ సినిమా తీస్తా అనడం ఎంత వరకు కరెక్ట్

7. ఇండియన్ చట్టాలకు ఈ సినిమ వర్తించదు అని చెప్తున్నావు దానికి ఆదారాలు

8. సినిమా అమెరికాలో తీసా అక్కడినుండే అప్లోడ్ చేసా అంటున్నారు ఎలా తీసారు

9. సినిమా పెట్టుబడి ఎక్కడిది.... విమియో వెబ్సైటుకి ఎంతకు అమ్మారు

10. మాల్కోవాకి డబ్బులు ఎక్కడనుంచి ఇచ్చారు... సినిమా షూటింగ్ కి వాడిన ఎక్విప్మెంట్ ఎక్కడిధీ, డబ్బులు అమెరికాలో ఎవరు ఇచ్చారు
అనే ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. కానీ ఆ ప్ర‌శ్న‌ల‌పై స‌మాధానం చెప్ప‌క‌పోగా ...జీఎస్టీ సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించారా..? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తానేం తీయ‌లేదంటూ చెప్ప‌డం పో్లీసుల్ని విస్మ‌యానికి గురి చేసింది. కానీ జీఎస్టీ తీసిన సినిమాకు సంబంధించి కొన్ని వీడియోల్ని ఆయ‌నకు చూపెట్ట‌గా వ‌ర్మ నోట్లో నుంచి మాట‌రాలేద‌ని తెలుస్తోంది. మొత్తానికి సామాజిక కార్యకర్త దేవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అభియోగంపై వర్మ ఇర‌కాటంలో ప‌డ్డార‌ని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story