కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

nanireddy
Updated on: 24 Dec 2018 4:23 PM IST
కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్
X

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, కొడంగల్‌లో అసెంబ్లీ అభ్యర్థి రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నియోజకవర్గంలోని కోస్గిలో ఇవాళ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తోంది టీఆర్‌ఎస్‌. ఈ సభను అడ్డుకోవాలంటూ రేవంత్ రెడ్డి తన అనుచరులకు పిలునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ హాజరకానున్న ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గులాబీ శ్రేణులు. అరెస్ట్ అనంతరం.. రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. తన అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి. కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన సీఎం కేసీఆర్... కొడంగల్‌ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ సభను అడ్డుకుంటామంటూ పిలుపునిచ్చారు. దీంతో టీఆర్‌ఎస్‌నేతలు రేవంత్ పై ఈసీకీ ఫిర్యాదు చేశారు . ఈసీ ఆదేశాలతో ఈ తెల్లవారుజామున రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన అనుచరులను అరెస్ట్‌ చేశారు.

nanireddy

nanireddy

Next Story