కేటీఆర్‌ నేను గుర్తులేకపోయినా.. వాళ్లను గుర్తుంచుకో..

కేటీఆర్‌ నేను గుర్తులేకపోయినా.. వాళ్లను గుర్తుంచుకో..
x
Highlights

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘రేవంత్‌ రెడ్డి...

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘రేవంత్‌ రెడ్డి ఎవరో తెలియదని కేటీఆర్‌ అన్నారు. నేను గుర్తు లేకపోయినా కనీసం...కోదండరామ్‌, శ్రీకాంతాచారిను గుర్తుంచుకో’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డాక్టర్‌ కోర్స్‌ను మంత్రి లక్ష్మారెడ్డి ఎక్కడ చదివారో చెప్పాలని, ఇద్దరి సత్తాను జడ్చర్లలో తేల్చుకుందామన్నారు.

కాగా మంత్రి కేటీఆర్‌ నిన్న (గురువారం) ట్వీటర్‌లో నెటిజన్లతో సంభాషించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులు, పవన్‌ కల్యాణ్‌, రేవత్‌ రెడ్డి.. ఇలా చాలా అంశాలపై నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ రేవంత్‌ రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి గురించి రెండు మాటల్లో చెప్పండంటూ ట్విట్‌ చేయగా...హూ ఈజ్ దట్ అంటూ కేటీఆర్‌ రిప్లయ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories