ముందస్తుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం యాక్షన్‌ ప్లాన్‌...రేవంత్‌‌కే బాధ్యతలు ఇచ్చే ఛాన్స్‌

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల రచ్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న కమిటీలు సీనియర్లలో అసంతృప్తిని...

తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల రచ్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న కమిటీలు సీనియర్లలో అసంతృప్తిని రాజేస్తున్నాయి. ఆశించిన పదవి దక్కకపోతే కఠిన నిర్ణయాల తీసుకుంటామని వార్నింగ్‌ ఇస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఊహాగానాల మధ్య కాంగ్రెస్‌ అధిష్ఠానం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండేలా తెలంగాణలో పార్టీ యంత్రాంగానికి పార్టీ అధినేత రాహుల్‌గాంధీ పర్‌ఫెక్ట్‌ డైరెక్షన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలను హస్తినకు పిలిపించుకున్న రాహుల్‌ తెలంగాణలో ముందస్తు హడావిడిపై ఏఐసీసీ ఇన్‌ఛార్జి కుంతియా సహా ఇతర ఇన్‌ఛార్జ్‌లతో చర్చించినట్టు తెలుస్తోంది.

తెలంగాణ పీసీసీ కార్యవర్గం, టీపీసీసీ అనుబంధ కమిటీల నియామకంపై అధినేత రాహుల్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే, టీ.కాంగ్రెస్‌ కమిటీలకు సంబంధించి హెచ్ఎంటీవీకి కొన్ని ఆధారాలు సంపాదించింది. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ప్రచార, మేనిఫెస్టో కమిటీల కో-కన్వీనర్‌గా డీకే అరుణ, కోమటిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, మూడో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బలరామ్‌నాయక్‌ పేర్లను అధిష్ఠానం పరిశీలించినట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రచార కమిటీ సారథ్య బాధ్యతను కోరుకుంటున్న వీహెచ్‌ ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతను వీహెచ్‌ ఆశిస్తుండగా అధిష్ఠానం రేవంత్‌‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే వీహెచ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఆశిస్తున్న పదవి దక్కకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటానంటానని వీహెచ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ప్రచార కమిటీ చైర్మన్ పదవికి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క కూడా పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ముగ్గురిలో హైకమాండ్ ఎవరికి ఆ పదవిని అప్పగిస్తుందోనన్నది పార్టీలో ఆసక్తిగా మారింది. అయితే, పదవి రాని వారిని పార్టీ ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories