రేవ్ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్..

రేవ్ పార్టీ భగ్నం.. 11 మంది అరెస్ట్..
x
Highlights

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నిన్న రాత్రి ఆ రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని...

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
నిన్న రాత్రి ఆ రిసార్ట్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. సిబ్బందితో వెంటనే ఆ రిసార్ట్ వద్దకు చేరుకుని మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో అమ్మాయిలు నలుగురు, అబ్బాయిలు 7మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా అబ్బాయిల్లో అందరూ వైద్య విద్యార్థులని అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీకి వచ్చిన అమ్మాయిలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించినట్టు మెడికల్ కిట్లను పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories