జనసేనలోకి మాజీ క్రికెటర్‌

జనసేనలోకి మాజీ క్రికెటర్‌
x
Highlights

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌. సమస్యల పరిష్కరించడం కోసం తుదిశ్వాస వరకు పోరాడుతానన్నారు....

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని చోట్ల పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌. సమస్యల పరిష్కరించడం కోసం తుదిశ్వాస వరకు పోరాడుతానన్నారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు గురువారం జనసేన పార్టీలో చేరారు. విశాఖలో జనసేన అధినేత పవన్‌ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. భారత్‌ తరపున 2005లో ఆరంగ్రేటం చేసిన వేణుగోపాలరావు శ్రీలంకతో తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు. పవన్‌ అభిమానులు సైతం భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. పోరాటయాత్రలో భాగంగా పవన్‌ విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories