రిజర్వేషన్లపై.. కేసీఆర్ కు ఎందుకంత ఇంట్రెస్ట్??

రిజర్వేషన్లపై.. కేసీఆర్ కు ఎందుకంత ఇంట్రెస్ట్??
x
Highlights

రిజర్వేషన్ల అంశాన్ని ఈ మధ్య.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా తెరపైకి తెస్తున్నారు. తెలంగాణలో 85 శాతానికిపైగా.. బడుగు, బలహీన వర్గాలు, వెనకవడిన...

రిజర్వేషన్ల అంశాన్ని ఈ మధ్య.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా తెరపైకి తెస్తున్నారు. తెలంగాణలో 85 శాతానికిపైగా.. బడుగు, బలహీన వర్గాలు, వెనకవడిన కులాలు, మైనారిటీలే ఉన్నపుడు.. వారికి జనాభా దామాషా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని కేంద్రాన్ని ప్రతి సందర్భంలోనూ నిలదీస్తున్నారు. పైగా.. తాము తీసుకున్న నిర్ణయానికి అనుకూల అంశాలను కూడా వివరిస్తూ.. ఈ వివాదంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని తీవ్రం చేస్తున్నారు.

అందులో భాగంగానే.. ఇప్పుడు మరోసారి ఆర్టికల్ 16(4) లో జనాభా దామాషా అన్న పదం లేదని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. తగినంత ప్రాతినిధ్యం.. అన్న పదాలను మాత్రమే వాడారు తప్ప.. కచ్చితంగా జనాభా ప్రాతిపదికన ఇవ్వకూడదు.. అన్న మాట మాత్రం చట్టంలో లేదని తేల్చి చెబుతున్నారు. తన వాదనకు అనుకూలమైన అంశాలను కేంద్రానికి చెప్పి చూడాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే.. రిజర్వేషన్లపై రాష్ట్రం చేస్తున్న వాదనకు ప్రతిగా.. కేంద్రం ఓ లేఖ పంపింది. తగినంత ఆధారాలు, వాస్తవాలు చూపించలేదని.. తగిన వివరణ ఇవ్వాలని కోరుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి లేఖ అందింది. దీనిపై.. అన్ని అనుమానాలు తీర్చేలా.. రిజర్వేషన్లు న్యాయమే అన్న నిర్ణయానికి కేంద్రం కూడా వచ్చేలా.. జవాబు పంపాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ఆ తర్వాత.. కేంద్రం స్పందించే తీరును బట్టి… తన కార్యాచరణ సిద్ధం చేస్తారని తెలుస్తోంది.

ఇదంతా చూస్తున్న విపక్షాలు.. వైఫల్యాలను పక్కన పెట్టేందుకే.. జనం దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని.. సంక్షేమాన్ని గాలికి వదిలేశారని అంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. జనాన్ని మాయ చేసేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories