చిన్నారి చేతన

చిన్నారి చేతన
x
Highlights

భాగ్యనగరంలో కిడ్నాప్‌ అయిన ఆరు రోజుల ఆడ శిశువు ఆచూకీ లభించింది. పోలీసులు బిడ్డను క్షేమంగా తల్లి దగ్గరకు చేర్చారు. శిశువుకు మెరుగైన వైద్యం కోసం...

భాగ్యనగరంలో కిడ్నాప్‌ అయిన ఆరు రోజుల ఆడ శిశువు ఆచూకీ లభించింది. పోలీసులు బిడ్డను క్షేమంగా తల్లి దగ్గరకు చేర్చారు. శిశువుకు మెరుగైన వైద్యం కోసం నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సుల్తాన్‌ బజార్‌ ఏసీపీ చేతన పేరునే తమ బిడ్డకు పెడుతున్నట్టు తల్లిదండ్రులు ఆనందభాష్పాలతో తెలిపారు. హైదరాబాద్‌ కోఠి ప్రసూతి ఆసుపత్రిలో కిడ్నాపైన చిన్నారి కథ సుఖాంతమైంది. బీదర్‌లో దొరికిన పసి పాపకి తల్లిదండ్రులు చేతన గా నామకరణం చేశారు.

ఆరు రోజులు చిన్నారి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాప ఆచూకీ లభించినప్పటికీ.., కిడ్నాప్ చేసిన మహిళా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా, సీసీ కెమెరాలు ఫుటేజ్‌తో బీదర్‌కి చెందిన మహిళే కిడ్నాప్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక కిడ్నాప్‌ చేసిన మహిళ రెండు సార్లు ఇలా శిశువులను కిడ్నాప్ చేయడానికి యత్నించిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ఇక శిశువును రెస్క్యూ చేయడంలో కీలక పాత్ర పోషించిన సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన ఐపీఎస్‌ను కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు. ఇక శిశువు తల్లి విజయను కమిషనర్ ఆంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి, సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన పరామర్శించారు. అయితే తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు చిన్నారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు. ఏడేళ్ల తర్వాత తనకు కూతురు పుట్టిందని, పుట్టిన ఆరురోజుల్లో కిడ్నాప్ కావడంతో తానూ తల్లడిల్లి పోయానంటూ తల్లి పోలీసులుకి తెలిపింది. పసిపాపని తల్లి చెంతకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఐపీఎస్ చేతన పేరును తన కూతురుకి నామకరణం చేస్తానంటూ తల్లి విజయ పోలీసులకి తెలిపింది..

చిన్నారి కిడ్నాప్ వ్యవహారంలో ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి ఆర్ఎంఓ విజయలక్ష్మి తెలిపారు. కిడ్నాప్ వ్యవహారంపై కమిటీ వేశామని, ఏడు రోజుల్లో కమిటి ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కోఠి ఆస్పత్రిలో చోటుచేసుకున్న శిశువు అపహరణ ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories