జియో దివాళి ఆఫర్‌ : ఏడాదంతా ఫ్రీ

nanireddy
Updated on: 24 Dec 2018 3:31 PM IST
జియో దివాళి ఆఫర్‌ : ఏడాదంతా ఫ్రీ
X

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో పండగ ఆఫర్లతో వినియోగదారుల్ని మరోసారి ఆకట్టుకుంటోంది. దీపావళి సందర్భంగా స్పెషల్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1699తో రీఛార్జ్‌ చేయించుకుంటే వచ్చే ఏడాది దివాళి వరకు కస్టమర్లు ఉచితంగా అన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద ఉచితంగా లోకల్‌, రోమింగ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, సంవత్సరం పొడవునా 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. అలాగే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా 1699 రూపాయల ప్లాన్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందాలంటే 2018 నవంబర్‌ 30 లోపు కస్టమర్లు ఈ స్కీమ్‌లోకి ఎంటర్‌ కావాల్సి ఉంటుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ను కూపన్ల రూపంలో పొందవచ్చని చెబుతోంది. రిలయన్స్‌ డిజిటల్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మిని స్టోర్లలో కనీసం రూ.5000 పైన కొనుగోలు చేస్తే వాడుకోవచ్చు. అయితే కస్టమర్లకు వచ్చిన ఈ ఓచర్లు 2018 డిసెంబర్‌ 31కు ఎక్స్‌పైరీ అయిపోతాయి. ఆలోపే వాడుకోవలసి ఉంటుంది.

nanireddy

nanireddy

Next Story