ప్రేమికుల్ని కార్లతో వెంటాడిన కుటుంబ సభ్యులు..అంతలోనే
రహస్యంగా పెళ్లి చేసుకున్న జంటపై పెద్దలు కక్ష కట్టారు. కారులో పారిపోతున్న కొత్త జంట ప్రయాణిస్తున్న కారును ఛేజ్...
రహస్యంగా పెళ్లి చేసుకున్న జంటపై పెద్దలు కక్ష కట్టారు. కారులో పారిపోతున్న కొత్త జంట ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేయడంతో ఆ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ చనిపోగా...మరో వ్యక్తి పరిస్థితి సీరియస్ గా ఉంది. ప్రేమ జంటకు కూడా గాయాలయ్యాయి. వారు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇల్లందుకు చెందిన శ్రీపతి సుమన్ , ఎండి షాహిన్ మహబూబ్ నగర్ దగ్గర్లోని అనంతారంలో నిన్న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇల్లందు పోలీసుల్ని ఆశ్రయించగా వారు అమ్మాయి పెద్దల్ని పిలిచి సర్దిచెప్పి పంపించారు. ఇల్లందులో ఉంటే ప్రమాదమని భావించిన శ్రీపతి సుమన్ , ఎండి షాహిన్.. హైదరాబాద్‌కు బయల్దేరారు. ప్రేమ పెళ్ళిపై ఆగ్రహంగా ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారిని వెంబడించారు. ఖమ్మం దగ్గర్లో దాడికి యత్నించారు. ప్రేమ జంట ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేశారు. వారిని తప్పించుకునే క్రమంలో కారు చెట్టుకు గుద్దుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమ జంటకు గాయాలయ్యాయి.
లైవ్ టీవి
బ్రేకింగ్: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
12 Dec 2019 7:57 AM GMTగ్రామ సచివాలయలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
12 Dec 2019 7:57 AM GMTభీమవరంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
12 Dec 2019 7:45 AM GMTడాక్టర్ చంద్రహాసన్ రెడ్డికి అంబేద్కర్ సేవా పురస్కారం
12 Dec 2019 7:43 AM GMT'మగధీర'లా చంద్రబాబు... చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా
12 Dec 2019 7:27 AM GMT