జగన్ కు నేను అందుకే సపోర్ట్ చెయ్యలేదు పవన్ కళ్యాణ్..!

Highlights

గతంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతోనే వైసీపీకి గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

గతంలో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతోనే వైసీపీకి గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.. అంతేకాదు జగన్ తో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని, అసలు అతని మీద నేను ఎందుకు కోపంతో ఉండాలన్నారు.. ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ.. బీజేపీ అంటే తనకు ఇష్టం లేకపోయినా కూడా ఆరోజు పరిస్థితుల ప్రభావరీత్యా మద్దతు ఇచ్చాను.. ఇటు రాష్ట్రంలో కూడా అదే నిర్ణయంతో ముందుకెళ్లాను నాకు చంద్రబాబుగారు వాడుకుని వదేలేసే రకమని తనకు తెలిసినా.. నేను టీడీపీకి మద్దతు ఇచ్చానని కానీ ఇవాళ వారు సరిగా పరిపాలించడంలేదేమోనన్న అభిప్రాయం తనలో వ్యక్తమవుతుంది.. కొన్ని రోజులు చూస్తాం.. సామ, దాన భేద, దండోపాయాలు ఉపయోగించి ఏమి చెయ్యాలో అప్పుడు చేస్తామని పవన్ హెచ్చరించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories