త్వరలో రూ. 20 కొత్త నోటు: ఆర్బీఐ

nanireddy
Updated on: 28 Dec 2018 12:16 PM IST
త్వరలో రూ. 20 కొత్త నోటు: ఆర్బీఐ
X

2016 నవంబరు 8న నోట్ల రద్దు తర్వాత.. రూ.500, రూ.2,000 కరెన్సీ నోట్లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విడతల వారీగా రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రూ.20 కరెన్సీ నోట్లపై దృష్టిసారించింది. కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్న ఆర్బీఐ త్వరలో రూ. 20 నోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆలాగే పాత రూ. 500, రూ. 1,000 నోట్లు మినహా.. చలామణిలో ఉన్న మిగతా పాత కరెన్సీ చెల్లుబాటులో ఉంటుందని స్పష్టంగా పేర్కొంది.

nanireddy

nanireddy

Next Story