ఆకాశంలో అద్భుతం...మళ్లీ ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే 2025 సెప్టెంబర్ 7వరకు ఆగాల్సిందే

ఆకాశంలో అద్భుతం...మళ్లీ ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే 2025 సెప్టెంబర్ 7వరకు ఆగాల్సిందే
x
Highlights

అంతరిక్షంలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతంకాబోతోంది. అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం ఆకాశవీధిలో కనువిందు చేయనున్నది. వందల ఏళ్ల తర్వాత ఆవిష్కృతం కాబోతున్న ఈ...

అంతరిక్షంలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతంకాబోతోంది. అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం ఆకాశవీధిలో కనువిందు చేయనున్నది. వందల ఏళ్ల తర్వాత ఆవిష్కృతం కాబోతున్న ఈ అద్భుత ఘట్టం ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణంగా రికార్డులెక్కనుంది. చంద్రుడు ఆరుగంటలకు పైగా భూమి నీడన గడపనున్నాడు. దాదాపు 103 నిమిషాలపాటు అరుణ జాబిలిగా మారనున్న చంద్రుడు ముదురు ఎరుపు రంగులో రక్తవర్ణంగా మారనున్నాడు.

103 నిమిషాలపాటు రక్తవర్ణం పులుముకోనున్న జాబిలి దాదాపు 6గంటలకుపైగా భూమి నీడన గడపనున్నాడు. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా చంద్ర, కుజ గ్రహాలు జంటగా కనువిందు చేయనున్నాయి. ప్రారంభం నుంచి చివరివరకు వివిధ ప్రక్రియలు కలిపి మొత్తం 6గంటలపాటు గ్రహణం కొనసాగునుంది. మళ్లీ ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే 2025 సెప్టెంబర్ 7వరకు ఆగాల్సిందే.

భారత్‌లో రాత్రి 10:45కి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం శనివారం తెల్లవారుజామున 4:59కి ముగియనుంది. రాత్రి 10:45కి గ్రహణం ప్రారంభమైనా రాత్రి 11:54కి పూర్తిస్థాయిలో కనిపించనుంది. ఇక అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 2:43 మధ్య సంపూర్ణ చంద్రగ్రహణం ఆవిష్కృతంకానుంది. ఈ సమయంలోనే దాదాపు 103 నిమిషాలపాటు ముదురు ఎరుపు రంగులో కనిపించనున్నాడు. తెల్లవారుజాము 3:49వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. 3:49 తర్వాతే భూమి నీడ నుంచి చంద్రుడు బయటపడనున్నాడు.

సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లోన్ని ఆలయాలు మూసివేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర, కొండగట్టు, మహానంది, అహోబిలంతో పాటు ఇతర ప్రధాన ఆలయాలు మూసివేస్తారు. తిరిగి మళ్లీ శనివారం తెల్లవారుజామున ఆలయ శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

తిరుమల ఆలయాన్ని సాయంత్రం 5గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 4:15వరకు మూసివేయనున్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచి మళ్లీ సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. చంద్రగ్రహణం కారణంగా గురువారం సాయంత్రం నుంచే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించని టీటీడీ ఈరోజు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, పౌర్ణమి గరుడసేవలను రద్దుచేసింది.

వేములవాడ ఆలయాన్ని మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి శనివారం తెల్లవారుజాము 3:45వరకు మూసివేయనున్నారు. అలాగే బాసర ఆలయం మధ్యాహ్నం 12:50నుంచి శనివారం తెల్లవారుజాము 5:15వరకు మూతపడనుంది. ఇక భద్రాద్రి టెంపుల్‌ మధ్యాహ్నం 2గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 4:30వరకు మూతపడనుండగా శనివారం ఉదయం 8నుంచి మళ్లీ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అలాగే యాదాద్రి ఆలయాన్ని మధ్యాహ్నం 2గంటల నుంచి శనివారం ఉదయం వరకు క్లోజ్‌ చేయనున్నారు. ఇక శ్రీశైలం ఆలయం మధ్యాహ్నం 2గంటల నుంచి శనివారం ఉదయం వరకు మూతపడనుండగా, శనివారం ఉదయం 7నుంచి మళ్లీ దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఇక అన్ని ఆలయాలకు భిన్నంగా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని యథావిధిగా తెరిచి ఉంచి గ్రహణం సందర్భంగా గ్రహణ కాలాభిషేక పూజలు చేయనున్నారు.

దేశంలో ఎక్కడి నుంచి చూసినా ఈ సంపూర్ణ గ్రహణం సాక్షాత్కరించనున్నది. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించనున్నారు. దీనిని అంతరిక్ష పండుగలా నిర్వహించేందుకు పరిశోధకులు, ఖగోళప్రియులు ఏర్పాట్లు చేస్తుండగా ఈ అరుదైన సందర్భానికి సాక్షులుగా నిలవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుణ జాబిలిని నేరుగా కంటితో చూడొచ్చని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అపోహలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎక్లిప్స్ ఈటింగ్ సెల్ఫీ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు.

అరుదైన అరుణవర్ణ సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఆస్వాదిద్దామని ఖగోళ నిపుణులు పిలుపునిచ్చారు. అరుణ వర్ణంలో మెరిసే చంద్రుడితో సెల్ఫీలు దిగి మూఢనమ్మకాలకు పాతరేద్దామని వ్యాఖ్యానించారు. గ్రహణ సమయంలో హాయిగా ఇష్టమైన వంటకాలనూ తినాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories