రామలక్ష్మి గా రాబోతున్న సమంత

రామలక్ష్మి గా రాబోతున్న సమంత
x
Highlights

రామ్‌చరణ్‌ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా...

రామ్‌చరణ్‌ – సమంత జంటగా రానున్న మూవీ ‘రంగస్థలం’. షూట్ దాదాపుగా పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా చిట్టిబాబుగా చెర్రీని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినీ లవర్స్‌ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సమంత పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ‘మా రామలక్ష్మిని శుక్రవారం 11 గంటలకు కలవండి’ అంటూ ఓ పోస్టర్‌ని అభిమానులతో షేర్ చేసింది యూనిట్. కాగా ఈ విషయాన్ని మన సమంత మళ్ళీ గుర్తుచేసేందుకు ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టింది.

"నాకు రామలక్ష్మి గా నటిస్తున్నపుడు కలిగిన ప్రేమే మీకు కూడా చూస్తున్నప్పుడు కలుగుతుందని ఆశిస్తున్నా.. ఇలాంటి అద్భుతమైన గర్వించదగ్గ పాత్రను నాకు ఇచ్చినందుకు సుకుమార్ కు ధన్యవాదాలు" అంటూ తన ఫోటోను కూడా పెట్టింది. వెనక్కి తిరిగి కూర్చున్న రామ లక్ష్మీ మనకు దర్శనం ఇస్తుండగా "మా రామలక్ష్మి ని రేపు 11 గంటలకు కలవండి" అని రాశారు. చిట్టిబాబు లాగానే రామలక్ష్మి కూడా మనల్ని మెప్పిస్తుందో లేదో వేచి చూద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories