విజయ్ మాల్యా, నీరవ్ మోడీ స్థాయిలో కాకపోయినా బ్యాంకులను ముంచడంలో రకరకాల పద్ధతులు అవలంభించేవారు దేశమంతా నిండిఉన్నారు. కాకుంటే దొరకనంతవరకు దొరలే. అలాంటి...
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ స్థాయిలో కాకపోయినా బ్యాంకులను ముంచడంలో రకరకాల పద్ధతులు అవలంభించేవారు దేశమంతా నిండిఉన్నారు. కాకుంటే దొరకనంతవరకు దొరలే. అలాంటి ఒక వ్యక్తి హెచ్.డి.ఎఫ్.సి, స్టేట్ బ్యాంక్ వంటి బ్యాంకులకే క్రెడిట్ కన్నంపెట్టి చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
క్రెడిట్ కార్డు వాడుకొని డబ్బులు కట్టకపోవడం కామన్. కానీ క్రెడిట్ కార్డుల కోసమే లేని ఒక కంపెనీ సృష్టించి, అందులో 41 మంది పేరుతో ఒక్కడే క్రెడిట్ కార్డులు వాడుకొని కోటి రూపాయలకు పైగా బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టడం నయా దందా. పోలీసులకే ఒక కొత్త అనుభూతినిచ్చిన ఈ దోపిడీకి వేదిక భాగ్యనగరమే.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి బడాబాబులు కొందరు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని డబ్బులు కట్టకుండా కొల్లగొడుతుంటే మరి కొద్ది మంది నకిలీ పత్రాలు ద్వారా క్రెడిట్ కార్డులు తీసుకొని వాడినంత వాడి కట్టాల్సిన సొమ్ము ను కట్టకుండా ఎస్కేప్ అవుతున్నారు ఇలాంటి దందానే నగరం లో బట్టబయలు చేశారు టాస్క్ ఫోర్సు పోలీసులు నాలుగు ప్రముఖ బ్యాంకు లు కి కోటి యాబై రెండు లక్షలు నట్టేట ముంచేశారు ఈ ముఠాలో పది మందిని అరెస్ట్ చేశారు.
ఒక నకిలీ కంపెనీ సృష్టియించాడు 41 మంది తన సంస్థలో ఉద్యోగులు ఉన్నట్లు చూపించాడు దీంతో ప్రముఖ బ్యాంకు లలో ఖాతాలు తెరిచి మూడు నెలలు పాటు లేని వారిని ఉన్నట్లు సృష్టించిన ఉద్యోగులు కి మూడు నెలలు జీతాలు వేశాడు ఆ తరువాత ఇకేముంది మూడు నెలలు చెల్లించిన జీతాలను ఆ 41 బ్యాంకు క్రెడిట్ కార్డులు నుండి తానే ఒక్కడే డబ్బులు డ్రా చేస్తాడు ఇక్కడి వరకు అందరికి ఏముంది లే అనిపిస్తుంది ఆతరువాత ఉంటుంది అస్సలు కథ ..
ప్రాణిక నానో సిస్టం ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ నకిలీ కంపెనీ ని సృష్టి యించాడు కుంబం రంగారెడ్డి అనే వ్యక్తి అందులో 41 మందిని లేనివారిని ఉన్నట్లు గా ఉద్యోగులు సృష్టించాడు వారి పేర్లు మీద HDFC, STAT BANK OF INDIA , STANDERD BANK , RBL BANK లలో ఉద్యోగులు పేరుమీద బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేశాడు. అలాగే ఈ 41మంది సృష్టించిన ఉద్యోగులుకి మూడు నెలలు పాటు సాలరీలు వారి వారి ఖాతాలు కి జమ చేశాడు .. అయితే మూడు నెలలు తరువాత తానూ అనుకున్న టార్గెట్ కి రీచ్ అయ్యాడు ,.. ఆప్పుడు ఆ 41 మంది బ్యాంకు స్టేట్ మెంట్ లతో ఈ నాలుగు బ్యాంకు ల నుండి క్రెడిట్ కార్డులు పొందాడు ఆ తరువాత కుంబంరంగా రెడ్డి ఒక్కడే ఈ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకొని కార్డ్ యొక్క లిమిట్ దాటినా తరువాత వాటిని కట్టకుండా ఎస్కేప్ అవుతూ వస్తున్నాడు ఇచ్చిన డాక్యుమెంట్లు లో అడ్రస్ కి వెళ్లి చుస్తే ఉండరు నకిలీ పాన్ కార్డులు , నకిలీ ఓటరు ఐడి లు , గుర్తు తెలియని పాస్ ఫోటోలు తో క్రెడిట్ కార్డులు పొందినట్లు గుర్తించి పోలీసులు కి ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు . ఒక్కడే అంత చాకచక్యంగా కార్పొరేట్ బ్యాంకులను ఎలా మోసగించగలిగాడనేది పోలీసులకే మొదట అంతుపట్టలేదు. తర్వాత కేసు లోతుల్లోకి వెళితేగానీ అసలు విషయం బైటపడలేదు.
ఈ క్రెడిట్ కార్డులు స్కాం పై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులకి నమ్మ లేని నిజాలు తెలిశాయి. కుంబం రంగారెడ్డి తన బావమరిది వినయ్ కుమార్ సహాయం తో ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. GHMC ఉద్యోగులు కూడా వీళ్లకు సాయపడినట్లు తేలింది.
జీహెచ్ఎంసీ ఎలక్షన్ సెక్షన్ లో పని చేసే ఉద్యోగులు వరి కుప్పల శ్రీకాంత్ , మక్కుల నరేష్ డబ్బులు కక్కుర్తి పడి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఓటరు ఐడి కార్డులను కుంబం రంగారెడ్డికి ఇచ్చారు. ఆ తరువాత క్రెడిట్ కార్డులు వెరిఫికేషన్ లు చేసే సమయం లో కూడా కొంత మంది బ్యాంకు సిబ్బంది వెరిఫికేషన్ చేయాల్సిన ఫీల్డ్ వర్కర్లు కూడా కుమ్మకై వారి ఇచ్చిన అడ్రస్ లో ఉన్నారు అంటూ ఫైల్ ముందుకు పంపించారు దీంతో సులువుగా క్రెడిట్ కార్డులు పొంది, కార్డు లిమిట్స్ మొత్తం వినియోగించుకున్నట్లు విచారణ లో వెల్లడైంది . మొత్తం 41 మంది పేర్లు తో 41 సెల్ ఫోన్స్ కూడా పెట్టి అందులో కాంటాక్ట్ నెంబర్ లు కుడాఉన్నట్లు గుర్తించారు మొత్తం ఈ స్కాం లో పది మంది నిందితులు ను అరెస్ట్ చేశారు. అందులో కుంబం రంగారెడ్డి కి సహకరించిన GHMC, బ్యాంకు సిబ్బంది ని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్సు పోలీసులు .
HDFC లో 45 లక్షల 72 వేలు ,STAT BANK OF INDIA లో 25.28 లక్షలు , STANDERD BANK 77 . 84 లక్షలు , RBL BANK 3.26లక్షలు మోసం చేశారన్నారు సీపీ శ్రీనివాస్ రావు. వీరు మొత్తం కోటి యాబై రెండు లక్షలు స్కాం చేస్తే వీరి వద్ద నుండి 6.90 లక్షలు నగదు, 125 క్రెడిట్ కార్డులు , సెల్ ఫోన్ లు, బ్యాంకు పాస్ పుస్తకాలు, కంప్యూటర్లను రికవరీ చేశామన్నారు వీరి పై ఐపీసీ 420, 468, 471 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
బ్యాంకులను మోసం చేయాలంటే బ్యాంకు సిబ్బంది పరోక్ష సాయమో, నిర్లక్ష్యమో కారణమవుతున్నట్లు మరోసారి ఈ ఘటనతో తేలింది. ప్రజా సొమ్మును కాపాడటంలో విఫలమవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభుత్వాలు దృష్టిసారంచకపోతే మరిన్ని మోసాల తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire