ఈసారి సంతోషం లేకుండా పోయింది: స్వర్ణలత భవిష్యవాణి

x
Highlights

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా నిన్న జోగిని శ్యామల చెప్పిన మాటలే రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి భక్తులు...

ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా నిన్న జోగిని శ్యామల చెప్పిన మాటలే రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిలబడి భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తన వద్దకు వచ్చేవారు సంతోషంతో కాక దుఖంతో వస్తున్నారని స్వర్ణలత రంగంలో తెలిపారు. ఏటా భక్తులు తనవద్దకు సంతోషంగానే వస్తున్నారని, అయితే ఈసారి మాత్రం సంతోషం లేకుండా పోయిందెందుకని స్వర్ణలత ప్రశ్నించారు.

ప్రభుత్వం తరపున సమర్పించిన బంగారు బోనం కొంత సంతోషం కొంత దుఖాన్ని కలిగించిందని చెప్పారు. బంగారు బోనంతో ఆనందపర్చడమనేది మూర్ఖత్వమే అని అన్నారు. ఆడపడుచులందరూ దుఖంతో ఉన్నారని ఆమె తెలిపారు. తన భక్తులకు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారని కానీ కీడే ఎక్కువగా చేస్తున్నారని భవిష్యవాణిలో ఆమె తెలిపారు. నా బిడ్డలను నేనే రక్షిస్తా అలాగే దుష్టులని శిక్షిస్తా’నని స్పష్టం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రంగంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

ఇక నిన్న జరిగిన లష్కర్ బోనాలలో జోగిని శ్యామల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావోద్వేగం ఆపుకోలేక కంటతడి పెట్టారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒక్కొక్కరు 10 కిలోల బరువు బోనంతో క్యూ లైన్లో నిలబడి ఉంటే వాళ్లందరినీ ఆపేసీ వీఐపీలను దర్శనాలకు పంపిచడమేంటని శ్యామల ప్రశ్నించారు ప్రతిష్టాత్మక బోనాలకు ఇవేనా ఏర్పాట్లు అంటూ మండిపడ్డారు 26 ఏళ్లుగా తాను బోనాలు చేస్తున్నానని, సంప్రదాయ సంస్కృతులను కాపాడుతున్నానని ఆమె చెప్పారు.

ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనం విషయంలో అసంతృప్తికి గురైన భక్తులకు, ప్రజలకు తలసాని శ్రీనివాస్ క్షమాపనలు తెలిపారు అమ్మవారి బోనాల జాతరకు గతంలో కంటే ఈ ఏడాది ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు తెలిపిన ఆయన అధిక సంఖ్యలో భక్తులు దేశ, విదేశాలనుంచి రావడం, స్థలం తక్కువగా ఉండటంతో ఇబ్బంది ఎదురైందని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించామన్నారు. రాజకీయాలకతీతంగా అందరికీ అమ్మవారి దర్శనం కల్పించామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories