నీలాంబరి' అయిన శివగామి అయిన ఆమెకు తిరుగులేదు

నీలాంబరి అయిన శివగామి అయిన ఆమెకు తిరుగులేదు
x
Highlights

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి ప్రపంచ వ్యాప్తంగా పేరువచ్చింది...అయితే ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలని మీకు...

బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకి ప్రపంచ వ్యాప్తంగా పేరువచ్చింది...అయితే ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలని మీకు తెలుసా... ఇంచుమించు రమ్యకృష్ణ..ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా, దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి. నరసింహ చిత్రంలో రజినీకాంత్తో పోటీపడి మరీ చేసిన 'నీలాంబరి' పాత్రను రక్తి కట్టించింది. ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ.. న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకున్న రమ్యకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించింది.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories