యూరప్ కాదా హైద‌రాబాద్ లో జీఎస్టీ షూటింగ్ జ‌రిగిందా

యూరప్ కాదా హైద‌రాబాద్ లో జీఎస్టీ షూటింగ్ జ‌రిగిందా
x
Highlights

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు తన తాజా లఘు చిత్రం 'జీఎస్టీ' లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టింది. ఓ న్యూస్ ఛానల్ డిస్కషన్ లో మహిళలపై అనుచిత...

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు తన తాజా లఘు చిత్రం 'జీఎస్టీ' లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టింది. ఓ న్యూస్ ఛానల్ డిస్కషన్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆయన హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ సందర్భంగా సినిమా మొత్తం విదేశాల్లోనే షూట్ చేశారని, తాను స్కైప్ ద్వారా కొన్ని సూచనలు మాత్రమే చేశానని వర్మ చెప్పారు. ఆ సినిమాను హైదరాబాద్‌లో తెరకెక్కించారని.. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. మియా మాల్కోవా కూడా హైదరాబాద్ వచ్చిందని.. అందుకు తమ వద్ద ఆధారాలున్నారని కథనంలో పేర్కొన్నారు. ఈ సినిమాను హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో షూటింగ్ చేశారని తెలిపింది. ఇదే నిజమైతే ఆ హోటల్‌పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇండియాలో పోర్న్ సినిమాలు తీయడం నిషిద్ధం. అలాంటిది వర్మ ఆ న్యూడ్ సినిమాను నిజంగా హైదరాబాద్‌లో తీసుంటే... అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories