ఆనం పార్టీ మారడం ఖాయం...జూలై 8న...?

ఆనం పార్టీ మారడం ఖాయం...జూలై 8న...?
x
Highlights

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో టీడీపీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు ఆయన దాదాపు రంగం...

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్వరలో టీడీపీని వీడనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు ఆయన దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. జూలై 8న వైఎస్‌ జయంతి సందర్భంగా ఆ పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలో రామనారాయణను కొనసాగించేందుకు టీడీపీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. గత రెండు, మూడు రోజులుగా అభిమానులు, సన్నిహితులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారాలనుకోవడానికి కారణాలు వివరిస్తూ, వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి పార్టీ మారాలనే నిర్ణయాన్ని కొన్ని నెలల ముందే రామనారాయణ రెడ్డి తీసుకున్నారు. టీడీపీలో చేరే సమయంలో చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. మినీ మహానాడు వేదికలపై కూడా టీడీపీని, పార్టీ విధానాలను ఆయన బహిరంగంగా విమర్శించారు. ఈ నెల 2న నెల్లూరులో జరిగిన నయవంచన దీక్ష వేదికపైనే ఆయన వైసీపీకి సంఘీభావం ప్రకటించాల్సి ఉంది. అయితే, రోజులు బాగాలేవని ఆ కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నారని సమాచారం.
జూలై 8వ తేదీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆనం రామరానా యణరెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories