ఇరకాటంలో పడిన రమణదీక్షితులు

x
Highlights

టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ఇరకాటంలో పడ్డారు. క్రైస్తవ మతప్రచారకులతో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టడం వివాదాస్పదమవుతోంది. దాంతో రమణదీక్షితులు...

టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు ఇరకాటంలో పడ్డారు. క్రైస్తవ మతప్రచారకులతో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టడం వివాదాస్పదమవుతోంది. దాంతో రమణదీక్షితులు హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఎదురుదాడి మొదలైంది. రమణదీక్షితులు ఫాదర్ దీక్షితులుగా మారిపోయారంటూ విమర‌్శలు చెలరేగుతున్నాయి.

ఏపీ ప్రభుత్వంపైనా, తిరుమల తిరుపతి దేవస్థానంపైనా తీవ్ర ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు క్రైస్తవ మత ప్రచారకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అన్యమతస్తుడైన జగన్‌‌‌ను, క్రైస్తవ మిషనరీలను కలిసి హిందువుల మనోభావాలను రమణదీక్షితులు దెబ్బతీశారని బ్రాహ్మణసంఘం మండిపడుతోంది. క్రైస్తవ మిషనరీలతో కుమ్మక్కైన రమణదీక్షితులు ఫాదర్‌ దీక్షితులుగా మారిపోయారని, రమణదీక్షితులను తిరుమల కొండపైకి రాకుండా ప్రభుత్వం నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రెస్ మీట్ లో రమణదీక్షితులు వెనుక కూర్చున్న అనిల్ వైఎస్ కుటుంబానికి బంధువని, రమణ వ్యాఖ్యల వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అయినా నేర చరిత్ర కలిగిన అనిల్‌తో రమణదీక్షితులకు ఉన్న సంబంధాలేంటో చెప్పాలన్నారు. వ్యక్తిగత స్వార్ధంతో క్రిస్టియన్ మిషనరీలతో కలిసిన రమణదీక్షితులు..హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారంటున్న బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని ఏడుకొండవాడిని క్షమాపణ అడగాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories