అవిశ్వాసంలో విజయం...పంతం నెగ్గించుకున్న సోమారపు

x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన రామగుండం అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. మేయర్‌, డిప్యూటి మేయర్‌లకు...

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన రామగుండం అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. మేయర్‌, డిప్యూటి మేయర్‌లకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మూడో వంతు ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్, డిప్యూటి మేయర్లు తమ పదవులు కోల్పోయారు. కాంగ్రెస్ జారీ చేసిన విప్ ధిక్కరించిన 17 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కోరంకు సరిపడా సభ్యులు హాజరు కాకుండా చూసేందుకు చివరి వరకు ప్రయత్నించిన మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ సాధ్యం కాకపోవడంతో సమావేశానికి దూరంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories