ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సదస్సులో రాష్ట్రపతి గుస్సా

x
Highlights

వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఐఈఏ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్న ఆయన న్యూ ఇండియా కల...

వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఐఈఏ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందన్న ఆయన న్యూ ఇండియా కల సాకారం అవ్వాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అర్థశాస్త్రం అనేక శాస్త్రాలను తనలో ఇముడ్చుకుందని, అర్థశాస్త్రం ఓ నదీ ప్రవాహం లాంటిదన్నారు. అయితే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ సదస్సులో రాష్ట్రపతి కోవింద్ ఓ సందర్భంలో అసహనానికి గురయ్యారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో నిర్వాహకులు సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు ఫుడ్ ఫ్యాకెట్లు పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ ఆపాలని కోవింద్ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories