logo
సినిమా

బ‌హిరంగ వాసి భ‌లే ఉందే

బ‌హిరంగ వాసి భ‌లే ఉందే
X
Highlights

అజ్ఞాతవాసి సినిమాపై ఆర్జీవీ ఎందుకు మాట్లాడ‌లేద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ ఉన్న‌ట్లుండి అజ్ఞాతవాసి గెట‌ప్ లో...

అజ్ఞాతవాసి సినిమాపై ఆర్జీవీ ఎందుకు మాట్లాడ‌లేద‌ని అంద‌రు అనుకున్నారు. కానీ ఉన్న‌ట్లుండి అజ్ఞాతవాసి గెట‌ప్ లో రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది. క‌త్తిమ‌హేష్ రివ్యూ ఎలా ఇచ్చాడు. అంటూ అనే విశేషాల్ని నెటిజ‌న్ల‌తో పంచుకున్న ఆర్జీవీ త‌న అభిమాని అజ్ఞాతవాసి పోస్టర్ ని షేర్ చేశాడు. మార్ఫింగ్ చేసిన ఫోటోలో ప‌వ‌న్ కు బ‌దులు ఆర్జీవీ ఫోటోను ఎడిట్ చేశాడు. అంతేకాదు ఆ ఫోటో పై అజ్ఞాతవాసి పోస్టర్ ని బహిరంగవాసి త‌గిలించారు. అసలే డివైడ్ టాక్ తో సతమతమవుతున్న అజ్ఞాతవాసికి వర్మ చేస్తున్న పోస్టులు కొంత వెటకారంగానే ఉన్నాయి. కామెడీగా చేసినా ఉన్నది ఉన్నట్టు ఏది తోస్తే అది మాట్లాడే వర్మకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని అభిమానులు అంటున్నారు. ఏదో ఒకటి చేయకపోతే ఆయన వర్మ ఎందుకు అవుతాడ‌ని సెటైర్లు వేస్తున్నారు.

Next Story