రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది

రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ అదిరింది
x
Highlights

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా దీపావళి సందర్భంగా ఈ చిత్ర...

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా దీపావళి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. మొదటగా ఈ చిత్రానికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈసినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా కియారా అడ్వాణీ నటించింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించింగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. వచ్చేఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని చిత్రబృందం తెలిపారు.


రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయం అంటున్నారు. ఈ సినిమా త‌ర్వాత రామ్ చ‌రణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌నున్నాడు. ఈ మూవీలో చెర్రీ పాత్ర చాలా ప‌వర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories