రాళ్ళపల్లిగా వారి ప్రసిద్ధి

రాళ్ళపల్లిగా వారి ప్రసిద్ధి
x
Highlights

రాళ్ళపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్ళపల్లి నరసింహారావు ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటులు. నటనను వృత్తిగా, ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా...

రాళ్ళపల్లిగా ప్రసిద్ధి చెందిన రాళ్ళపల్లి నరసింహారావు ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటులు. నటనను వృత్తిగా, ప్రవృత్తిగా కాకుండా నటనే ప్రాణంగా ప్రేమించేవాళ్లలో అరుదైన నటుడే రాళ్లపల్లి. చిన్నతనం నుంచే నాటకాలు వేస్తూ వస్తున్న రాళ్లపల్లి ఇప్పటి వరకూ ఎనిమిది వేలకు పైగా నాటకాల్లో నటించాడు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. వీటిలో చాలా భాగం తను స్వయంగా రాసి డైరెక్ట్ చేసినవే కావడం విశేషం. ఇక తనికెళ్ల భరణి లాంటి రచయితలకు మార్గదర్శి కూడా రాళ్లపల్లే అంటే ఆశ్చర్యం కలగక మానదు. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్‌, నావికుడు... ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. నటనలో ఆయనకంటూ ఒక సొంత శైలి ఉంది. మూడు దశాబ్దాలలో ఆరొందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు ఎన్నో పోషించారు రాళ్లపల్లి.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories