నేడు మంత్రివర్గ విస్తరణ

nanireddy
Updated on: 28 Dec 2018 12:13 PM IST
నేడు మంత్రివర్గ విస్తరణ
X

అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ సాధించి.. నేడు మంత్రివర్గ విస్తరణ చేయబోతోంది రాజస్థాన్‌ కాంగ్రెస్ పార్టీ. సీఎంగా అశోక్ గెహ్లాట్ తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. 13 మంది మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులుగా నేడు ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 17న సీఎంగా గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శాంతికుమార్ ధరీవాల్, ప్రసాదీలాల్ మీనా, బీడీ కల్లా తదితరులు నేడు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను కైవసం చేసుకుంది. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.

nanireddy

nanireddy

Next Story