విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. రైల్వే జోన్‌ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వింత వ్యాఖ్యలు చేశారు. రైల్వే...

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. రైల్వే జోన్‌ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వింత వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ కావాలని అడిగే వారు చట్టంలో ఏముందో చూడాలన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్‌ అంశం పరిశీలించాలని మాత్రమే ఉందని, పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా చెప్పామని పీయూష్ సమర్ధించుకున్నారు.

రైల్వే జోన్‌ కోసం ఏపీ ప్రజలు కొంతకాలంగా పోరాడుతున్నారు. ఒడిశా ఒప్పుకోలేదంటూ మొదట కేంద్రం మెలికపెట్టింది. అయితే విశాఖ పరిధి వరకు జోన్ ఇస్తే అభ్యంతరం లేదని ఆ రాష్ట్రం చెప్పింది. ఇందుకు ఏపీ కూడా సమ్మతించింది. అప్పటి నుంచి ఇదిగో ఇస్తున్నాం.. అదిగో ఇస్తున్నాం అంటూ బీజేపీ నేతలు చెప్పకుంటూ వస్తున్నారు. తాజా పీయూష్ గోయల్ ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదనే విషయం అర్థమవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories