బస్సు లాంటి రైలును చూశారా?

బస్సు లాంటి రైలును చూశారా?
x
Highlights

అవును. ఇది నిజమే. బస్సు లాంటి రైలు ఉంది. అది ఏదో దేశంలోనో.. మన దగ్గరే మరేదో రాష్ట్రంలోనో కాదు. అచ్చంగా మన తెలుగు గడ్డపై తిరుగుతోంది. అదీ.. చాలా కాలంగా...

అవును. ఇది నిజమే. బస్సు లాంటి రైలు ఉంది. అది ఏదో దేశంలోనో.. మన దగ్గరే మరేదో రాష్ట్రంలోనో కాదు. అచ్చంగా మన తెలుగు గడ్డపై తిరుగుతోంది. అదీ.. చాలా కాలంగా పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి కోటిపల్లికి నడిచే ఈ రైలంటే.. ఒకప్పుడు యమా క్రేజ్. చూడ్డానికి ఒకటే బోగీ ఉంటుంది. రైలు ఆకారమే ఉంటుంది. కానీ.. ఒకే బోగీ కావడంతో.. బస్సులా కూడా కనిపిస్తుంటుంది. అందుకే.. దీన్ని బస్సు లాంటి రైలుగా సరదాగా చెబుతూ ఉంటారు.

దీని చరిత్ర పెద్దదే. ఎందుకంటే.. పదమూడేళ్ల క్రితం ఈ రైలు ప్రారంభం కాగా.. పది బోగీలతో నడిచింది. చాలా మంది ఆదరణ కూడా చూరగొంది. కానీ.. రాను రాను ఈ మార్గంలో బస్సులు విపరీతంగా పడడంతో.. రైలులో ప్రయాణించే అవసరం ఉన్నవాళ్లు తగ్గిపోయారు. అందుకే.. దీన్ని రాను రాను ఒకే బోగీకి కుదించారు. కానీ.. మార్గ మధ్యంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే చాలా ప్రదేశాలు జనాన్ని కనువిందు చేస్తాయి. దీంతో.. పర్యాటకులు ఈ బస్సు లాంటి రైలులో చక్కర్లు కొట్టేందుకు ఈ మధ్య ఉత్సాహం చూపిస్తున్నారట.

ఎప్పుడైనా కాకినాడ వెళ్తే.. మీరూ ఈ రైలును చూడండి. వీలైతే ఎక్కి రండి. మంచి అనుభూతిని సొంతం చేసుకోండి.

Show Full Article

Print Article
Next Story
More Stories