నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: రాహుల్ గాంధీ

నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: రాహుల్ గాంధీ
x
Highlights

కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ.. హోటల్ హరిత ప్లాజాలో మీడియా సంపాదకులతో సమావేశమ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై రాహుల్ ఎడిటర్లతో మాట్లాడారు. వారు...

కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ.. హోటల్ హరిత ప్లాజాలో మీడియా సంపాదకులతో సమావేశమ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై రాహుల్ ఎడిటర్లతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత మోడీ చాప్టర్ ముగుస్తుందని వ్యాఖ్యానించిన రాహల్..లోక్‌సభలో తన కౌగిలింత ప్రధానికి నచ్చలేదని అన్నారు. ఇక జమిలి ఎన్నికలు సమాఖ్య స్పూర్తికి విరుద్ధమన్నారు...కాంగ్రెస్ అధినేత. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. మీడియాపైనా, జర్నలిస్టులపైనా దాడులు జరుగుతున్నాయన్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ రకమైన హిందూత్వను నమ్మనని అన్నారు. ఈ సమావేశంలో రాహుల్ పెళ్లిపై కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తన పెళ్లి కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో జరిగిపోయిందని రాహుల్ చమత్కరించారు. రాహుల్ చమత్కారం చూస్తుంటే ఇక భవిష్యత్తులో పెళ్లి చేసుకొనే అవకాశం లేదని మీడియా ప్రతినిధులు చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories