సీఎల్పీ లీడర్‌గా మల్లు భట్టి విక్రమార్కకు ప్రమోషన్ ..!

x
Highlights

తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కొత్త ఫార్ములా సిద్ధం చేశారు. నేతల మధ్య ఆధిపత్య పోరును తొలగించేలా సరికొత్త...

తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కొత్త ఫార్ములా సిద్ధం చేశారు. నేతల మధ్య ఆధిపత్య పోరును తొలగించేలా సరికొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాహుల్ నిర్ణయించినట్టు సమాచారం. సామాజిక వర్గాల వారిగా పదవులు కట్టబెట్టి ఒక్కో నేతకు 40 నియోజకవర్గాలను కేటాయించాలని భావిస్తున్నారు. దీంత పాటు ఇప్పటివరకు సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి స్ధానంలో మల్లు భట్టి విక్రమార్కను నియమించాలని రాహుల్ నిర్ణయించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇటీవల ఎన్నికలు జరిగిన పోరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా నియమించాలని రాహుల్ భావిస్తున్నారు. మరో సీనియర్ నేత వీహెచ్‌కు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories