చెయ్యి అధికారంలోకి

చెయ్యి అధికారంలోకి
x
Highlights

తెలంగాణలో, కేంద్రంలో తమ చేయి వస్తోందట, అధికారంలోకి ఇక వచ్చేది తామేనట, ప్రదాని మోదీలా వారు అబద్ధాలు చెప్పరట, వారు ఏది చెబుతారో అదే చేసి చూపిస్తారట....

తెలంగాణలో, కేంద్రంలో తమ చేయి వస్తోందట,

అధికారంలోకి ఇక వచ్చేది తామేనట,

ప్రదాని మోదీలా వారు అబద్ధాలు చెప్పరట,

వారు ఏది చెబుతారో అదే చేసి చూపిస్తారట. శ్రీ.కో


తెలంగాణలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘మోదీలా అబద్ధాలు చెప్పం. ఏది చెబుతామో.. అదే చేసి చూపిస్తాం. ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీలో వచ్చేది మా ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో స్వయం సంఘాల మహిళలతో రాహుల్‌ ముఖాముఖి మాట్లాడారు. ‘‘తెలంగాణలో కుటుంబపాలన సాగుతోంది. ఆ కుటుంబానికే అన్నీ దక్కుతున్నాయి. రైతుల భూములను లాక్కుంటున్నారు. మహిళలకు రక్షణలేదు. ఎక్కడ చూసినా అవినీతే’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories