రేపే 'కూటమి' భారీ బహిరంగ సభ

nanireddy
Updated on: 24 Dec 2018 4:15 PM IST
రేపే కూటమి భారీ బహిరంగ సభ
X

తెలంగాణలో ప్రజాకూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కూటమి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 28(రేపు)న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాంతోపాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు ఈ సభకు హాజరవుతున్నారు. కాగా అగ్రనాయకులు అందరూ కలిసి రేపటిరోజున ఉమ్మడి వేదికను పంచుకోబోతున్నారు.

nanireddy

nanireddy

Next Story