మంత్రాలయంలో లారెన్స్

Chandram
Updated on: 28 Dec 2018 12:17 PM IST
మంత్రాలయంలో లారెన్స్
X

ప్రముఖ హీరో, దర్శకుడు లారెన్స్ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని కుటుంబసభ్యుల సమేతంగా దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట చేశారు. దర్శనాంతరం శ్రీమఠం పీఠాధిపతి వారు ఆశీర్వదించారు. వేదపండితులు వేదశ్వీరచనం చేయగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారికి కుటుంబసభ్యులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ స్వామివారిని తమ కుటుంబసభ్యలతో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Chandram

Chandram

Next Story