మీరు ఫోన్ చేస్తే చాలు ఆదుకోవడానికి నేను మా టీం రెడీ...

మీరు ఫోన్ చేస్తే చాలు ఆదుకోవడానికి నేను మా టీం రెడీ...
x
Highlights

ప్రముఖ హీరో, కొరియోగ్రఫర్ ,డైరెక్టర్ లారెన్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తు ఎంతో మంది పేద రోగులకు సహాయం చేస్తున్న విషయం...

ప్రముఖ హీరో, కొరియోగ్రఫర్ ,డైరెక్టర్ లారెన్స్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తు ఎంతో మంది పేద రోగులకు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన హార్ట్ పౌండేషన్ ద్వార 150 వ హార్ట్ సర్జరీ చేయించాడు. ఈ సందర్బ్డంగా లారెన్స్ ట్విట్ చేసాడు ఈ రోజు నేను చాలా హ్యాపిగా వున్నాను.. కారణం నేను చేయించిన 150 వ సర్జరీ సక్సెస్ అయింది.. చిన్నారి కావ్యశ్రీ హార్ట్ లో హోల్ వుంటే విజయవంతంగా ఆపరేషన్ చేయించాను ఈ విజయాన్ని అందరితో పంచుకోవటం చాలా సంతోషంగా వుంది. పాప కోసం ప్రార్థించిన అందరికీ ఆపరేషన్ సక్సెస్ చేసిన డాక్టర్లకు చాలా చాలా థ్యాంక్స్ అంటు ట్విట్ చేసారు. మీ ఏరియాలో ఎవరైనా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ.. కుటుంబం ఆపరేషన్ కోసం డబ్బు వెచ్చించలేని పరిస్థితిలో ఉంటే లారెన్స్ చారిటబుల్ ట్రస్టును కాంటాక్ట్ అవ్వండి. 09790750784,09791500866’’ నంబర్ కు మీరు ఫోన్ చేస్తే చాలు ఆదుకోవడానికి నేను మా టీం రెడీగా వుంటాం అంటు ట్వీట్‌ చేసాడు లారెన్స్. లారెన్స్ చేసిన మంచి పనికి అందరు మెచ్చుకోవటమే కాదు..ఈ విషయాన్ని అందరికి షేర్ చేస్తు ఎవరైన ఇబ్బందుల్లో వుంటే వారికి సహాయం చేసిన వాళ్లం అవుతామంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories