పుష్పక విమానం సినిమా

పుష్పక విమానం సినిమా
x
Highlights

కొన్ని సినిమాలు చాల ప్రత్యేకంగా నిర్మించ బడుతాయి.. అలా నిర్మించబడిది పుష్పక విమానం అనే సినిమా.. తెలుగులో పుష్పక విమానం గానూ, మిగిలిన భాషలలో పుష్పక్...

కొన్ని సినిమాలు చాల ప్రత్యేకంగా నిర్మించ బడుతాయి.. అలా నిర్మించబడిది పుష్పక విమానం అనే సినిమా.. తెలుగులో పుష్పక విమానం గానూ, మిగిలిన భాషలలో పుష్పక్ గానూ విడుదల చేయబడిన ఈ చిత్రం సంభాషణలు లేకుండా కేవలం వాద్య సంగీత సహకారంతో నిర్మింపబడినది. ఈ సినిమా ఒక రోజు రాజుగా అనే కథను మూలంగా బెంగలూరు నగరాన్ని నేపథ్యంగా తీసుకొని నిర్మింపబడినది. ఇది సంభాషణలు లేని సినిమా. కనుక ఏ భాషకైనా చెందవచ్చును. ఈ సినిమా చిత్రీకరణ కలరులో సంభాషణలు లేకుండా అవసరానికి తగిన శబ్ధాల సహకారంతో తీయబడింది. ఈ చిత్రంలో సంభాషణలు లేవు. కానీ పూర్వపు మూకీ చిత్రాల్లో లాగా పాత్రలు పెదవులతో మాటలు పలికించడం లేదు. అందుకు భిన్నంగా ఈ చిత్రంలో సంభాషణలకు తావిచ్చే సన్నివేశాలను తప్పించి, సన్నివేశంలో సంభాషణలు వినిపించేందుకు వీలుకాని విధంగా కెమెరాను అమర్చి ఛాయాగ్రహణపు యుక్తితో మూకీని సాధించారు. మీరు ఇప్పటి వరకు చూడకుంటే తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories