పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డి: సీఎం

పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డి: సీఎం
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్‌ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి 8నెలల ముందుగానే బలమైన...

టీడీపీ అధినేత చంద్రబాబు స్టైల్‌ మార్చారు. ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటిస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి 8నెలల ముందుగానే బలమైన అభ్యర్ధులను ఇన్‌ఛార్జు‌లుగా నియమిస్తున్నారు. టీడీపీ సంప్రదాయాన్ని పక్కనబెట్టి వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందే అభ్యర్ధులను ప్రకటించే పనిలో పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు గత కొన్ని నెలలుగా చంద్రబాబు గట్టి కసరత్తే చేస్తున్నారు. ఈ క్రమంలో అనూషారెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావడం, చంద్రబాబు స్వయంగా ప్రకటించడం అంతా జరిగిపోయింది. రాత్రి విజయవాడలోని ఉండవల్లిలో టీడీప శ్రేణులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories