మోడల్ స్కూల్‌లో కీచక పర్వం

x
Highlights

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కీచక ప్రిన్సిపల్ పర్వం వెలుగులోకి వచ్చింది. ఇమాంపేట ప్రభుత్వ మోడల్ స్కూలులో మహిళా ఉద్యోగులను ప్రిన్సిపల్ శంకర్ నాయక్ ...

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కీచక ప్రిన్సిపల్ పర్వం వెలుగులోకి వచ్చింది. ఇమాంపేట ప్రభుత్వ మోడల్ స్కూలులో మహిళా ఉద్యోగులను ప్రిన్సిపల్ శంకర్ నాయక్ లైంగికంగా వేధిస్తున్నాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రిన్సిపల్ తీరుపై కేర్ టేకర్ ఝూన్సీరాణి ఫిర్యాదు చేసింది. ఫలితం లేకుండాపోవడంతో బాధితురాలు HMTVని ఆశ్రయించింది.

స్కూల్ లో మహిళా సిబ్బందిని ప్రిన్సిపల్ శంకర్ నాయక్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తన మాట విననివారిని బెదిరించి, మానసికంగా హింసిస్తాడు. తన కోరికలు తీర్చినవారు డ్యూటీ వచ్చినా రాకపోయిన పట్టించుకోడు. కీచక ప్రిన్సిపల్ కు కేర్ టేకర్ ఝాన్సీ రాణి లొంగలేదు. దీంతో ఆమెపై కక్ష సాధింపు చర్యలు దిగాడు. ఝాన్సీ రాణికి మూడు నెలలు సెలవు ఇవ్వలేదు. స్కూల్ నుంచి బయటకు వెళ్లనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడు.

కీచక ప్రిన్సిపల్ గురించి కేర్ టేకర్ ఝూన్సీ రాణి డీఈవోతో పాటు ఇతర విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. అతడిపై అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. శంకర్ నాయక్ వేధింపులు తాళలేక కేర్ టేకర్ ఝాన్సీరాణిని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు న్యాయం కావాలని హెచ్ ఎం టీవీని ఆశ్రయించింది. స్కూల్ లో పని చేస్తున్న మహిళా సిబ్బంది, విద్యార్థినులను ప్రిన్సిపల్ బారి నుంచి కాపాడాలని కోరుతోంది. తిరిగి తన ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటోంది. బాధితురాలు ఝాన్సీరాణికి విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయి. కీచక ప్రిన్సిపల్ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

హెచ్ఎంటివి చొరవతో ఝాన్సీరాణికి జరిగినఅన్యాయంపై డీఈవో సూర్యకుమారి స్పందించారు. కీచక ప్రిన్సిపల్ శంకర్ నాయక్ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. ఈ సాయంత్రంలోగా ఉన్నతాధికారులకు రిపోర్టు అందజేస్తామన్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని డీఈవో వెంకటనర్సమ్మ హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories