గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి భావోద్వేగం

arun
By arun
Updated on: 24 Dec 2018 12:44 PM IST
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి భావోద్వేగం
X

గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌​ భావోద్వేగానికి లోనయ్యారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి అవార్డుల ప్రదానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులతో పోరులో అసువులు బాసిన కార్పొరల్‌ జ్యోతి ప్రకాష్‌ నిరాలాకు ప్రకటించిన అశోక్‌ చక్ర అవార్డును అందించిన అనంతరం ఆయన కొద్దిసేపు ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో అక్కడ వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. అమరుడు జ్యోతి ప్రకాష్‌ తరపున ఆయన భార్య సుష్మానంద్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్‌ చక్ర శౌర్య పతకాన్ని అందుకున్నారు.

ఈ ఏడాది అశోక చక్ర అవార్డును కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలాకు దక్కింది. భారత వైమానిక దళానికి చెందిన జ్యోతి ప్రకాశ్.. ఉగ్రవాదులతో పోరాడారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్ర పోరులో జ్యోతి ప్రకాశ్ ప్రాణాలు వదిలారు. అత్యున్నత ఆర్మీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన భార్య అందుకున్నారు. రాజ్‌పథ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును అందజేశారు.
కార్పోరల్ జ్యోతి ప్రకాశ్‌కు అశోక చక్ర

arun

arun

Next Story