భగ్నప్రేమికుడి ... భావ గాధ...ఈ ..

భగ్నప్రేమికుడి ... భావ గాధ...ఈ ..
x
Highlights

తన ప్రేమ విఫలం అయిన తర్వాత...ఆ కథానాయకుడు పాడు కొనే పాటలు ఎన్నో వచ్చాయి...కానీ వాటన్నిటిలో...ప్రత్యేకంగా నిలిచిన పాట మాత్రం...అభినందన సినిమాలోని......

తన ప్రేమ విఫలం అయిన తర్వాత...ఆ కథానాయకుడు పాడు కొనే పాటలు ఎన్నో వచ్చాయి...కానీ వాటన్నిటిలో...ప్రత్యేకంగా నిలిచిన పాట మాత్రం...అభినందన సినిమాలోని... ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం... అనే ఈ పాట...
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం
మింగినాను హలాహలం

ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు
కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము
నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణము

నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసే పోయి
నా రేపటిని మరిచే పోయి
మానాలి నీ ధ్యానము
కావాలి నే శూన్యము
అపుడాగాలి ఈ మూగ గానం

ఒక్క సారి ఆ పాట వింటే... ఆ రచయిత ప్రేమని .. బాధని ...దాని లోతులను రాసాడో...మీకే అర్ధం అవుతుంది... బహుశ మీరు కూడా ఒక్క సారైన ఈ పాట పాడి వుంటే...ఇక ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories