దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..!

దారుణం : రైల్లోంచి గర్భిణి తోసివేత..!
x
Highlights

మచిలీపట్నం- బెంగళూరు మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. ఓ గర్భిణి నుంచి నగలు దోచుకున్న దుండుగుల అంతటితో ఆగకుండా ఆమెను...

మచిలీపట్నం- బెంగళూరు మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. ఓ గర్భిణి నుంచి నగలు దోచుకున్న దుండుగుల అంతటితో ఆగకుండా ఆమెను రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గొల్లపల్లివంక సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దివ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దివ్య బెంగళూరులో నివాసముంటున్నారు. బెంగళూరు వెళ్లేందుకు దివ్య నరసరావుపేటలో ట్రైన్‌ ఎక్కినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories