వైసీపీ నేత‌లు క్యాష్ చేసుకోలేక‌పోతున్నార‌న్న‌ ప్ర‌శాంత్ కిషోర్

x
Highlights

వైసీపీ అధినేత పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, దీన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం జిల్లా నేతలు విఫలమవుతున్నారు. అధినేత పాదయాత్ర...

వైసీపీ అధినేత పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే, దీన్ని క్యాష్ చేసుకోవడంలో మాత్రం జిల్లా నేతలు విఫలమవుతున్నారు. అధినేత పాదయాత్ర సమయంలో హడావిడి చేసిన నేతలు జిల్లాలో జగన్ టూర్ ముగిశాక ఆ జోష్ ని కంటిన్యూ చెయ్యలేకపోతున్నారు. నేతల తీరుపై ఆ ప్రాంతాల్లోని వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎనబై రోజులు.. వెయ్యికు పైగా కిలోమీటర్లు.. ఆరుజిల్లాలు.. అడుగడుగున జనంతో కలయిక. ప్రజా సమస్యలపై ఆరా.. ఇలా కొనసాగుతోంది వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న ప్రజాయాత్రలో ప్రజా సమస్యలను అద్యాయనం చేస్తూ.. ముందుకు వెళ్తున్నారు జగన్. ఇప్పటి వరకూ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన బాగానే వస్తున్నా.. ఆ జోష్ ను మాత్రం పార్టీ నేతలు క్యాష్ చేసుకోలేక పోతున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.

జగన్ పాదయాత్ర రాయలసీమ నుంచి నెల్లూరుకు చేరింది. ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే పాదయాత్ర ద్వారా పార్టీకి వస్తున్నఇమేజ్‌ను స్థానిక నేతలు కంటిన్యూ చెయ్యలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక కార్యకర్తల నుంచి, పార్టీ అధిస్థానానికి పిర్యాదులు అందుతున్నాయి. పాదయాత్ర ముగిసిన జిల్లాల్లో పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వేలో.. ఇవే విషయాలు బయటపడ్డాయి. ఇటీవల జగన్ పాదయాత్ర ముగిసిన ప్రాంతాల్లో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేసింది. ఈ సర్వేలో పాదయాత్ర సమయంలో కార్యకర్తల్లో ఉన్న జోష్.. పాదయాత్ర ముగిసాక కనిపించడంలేదని తేలింది.

అధినేత పాదయాత్ర చేసినప్పుడు హంగామా చేసి పాదయాత్ర ముగిసే వరకూ జనంలో కేడర్ తో ఉన్న‌ జిల్లాల నాయకులు, నియోజకర్గ ఇంచార్జులు పాదయాత్ర అనంతరం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ పాదయాత్రతో క్షేత్రస్థాయిలో పార్టీలో జోష్ వచ్చిందని సంబరాలు చేసుకున్న నేతలు అదే ఊపుని కొనసాగించడం‌లో మాత్రం చేతులెత్తేశారని పార్టీ కేడర్ లో చర్చ జరుగుతోంది. పాదయాత్ర ముగిసిన ఐదు జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల సమన్వయ కర్తలు తామే ఇక అభ్యర్థులమనే స్థాయికి రావడంతో‌ వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ తో గెలుస్తామనే ధీమాగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ టీం తామ సర్వే రిపోర్టును పార్టీ అధిష్టానానికి ఇచ్చింది. దీంతో పాదయాత్ర ముగిసిన జిల్లాలపై, అక్కడి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఫోకస్ పెట్టింది వైసీపీ అధిషాటనం. దీనికోసం పాదయాత్ర ముగిసిన ప్రాంతాల్లో నియోజకర్గ ఇంచార్జులను పిలిచి వివరణ కోరాలనే యోచనలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories