ఉత్తమ్‌ ఆలోచన వెనుక ఉన్న అసలు కథేంటి?

ఉత్తమ్‌ ఆలోచన వెనుక ఉన్న అసలు కథేంటి?
x
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... బస్సుయాత్ర రూట్‌ను అతి జాగ్రత్తగా ప్లాన్ చేసకుంటున్నారా? వివాదాలు, విభేదాలు లేని ప్రాంతాల్లోనే యాత్ర...

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... బస్సుయాత్ర రూట్‌ను అతి జాగ్రత్తగా ప్లాన్ చేసకుంటున్నారా? వివాదాలు, విభేదాలు లేని ప్రాంతాల్లోనే యాత్ర చేయాలన్నది ఆలోచనా? ఇప్పటి వరకు జరిగిన బస్సుయాత్ర రూట్ చూస్తే అలానే అనిపిస్తుందా? ఉత్తమ్‌ ఆలోచన వెనుక ఉన్న అసలు కథేంటి?

సీనియర్లంతా ఏకమై వ్యతిరేకించినా పంతం నెగ్గించుకొని బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు ఉత్తమ్‌కుమార్‌. తేదీల్లో మార్పులు చేయమని సలహా ఇచ్చినా సెంటిమెంట్‌ పేరుతో తాను అనుకున్న తేదీకే యాత్ర ప్రారంభించారు. మొదటి దశలో ఎదురైన సవాళ్లను రెండో విడతలో ఎదురవకుండా అతి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉత్తమ్‌కు అనుకూలంగా ఉండడంతో యాత్రను ఆ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగించాలన్నది ఆయన ప్లాన్‌గా చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. వరంగల్ జిల్లాల్లో నాయకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉండడంతో అక్కడ బస్సుయాత్ర తేదీలు ప్రకటించినా వెళ్లాలా వద్ద అన్న సంశంయంలో ఉన్నట్టు సమాచారం. ఇంకా చెప్పాలంటే అక్కడ బస్సుయాత్ర ఉంటుందా లేదా అనే అనుమానాలూ ఉన్నాయి.

పార్టీలో అత్యంత వివాదాస్పదమైన జిల్లాలుగా పేరున్న నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు మొదటి, రెండో విడత బస్సు యాత్రలో లేకుండా జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. రెండు విడుతల తరువాత ఈ జిల్లాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తే.. ఉత్తమ్‌ అక్కడ బస్సుయాత్ర కొనసాగిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories