ఉత్కంఠరేపుతున్న యాంకర్ ప్రదీప్ మద్యం కేసు..వారెంట్ జారీకి సిద్ధమవుతున్న పోలీసులు

ఉత్కంఠరేపుతున్న యాంకర్ ప్రదీప్ మద్యం కేసు..వారెంట్ జారీకి సిద్ధమవుతున్న పోలీసులు
x
Highlights

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ టీవీ యాంకర్ ప్రదీప్ కేసు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. పోలీసు కౌన్సిలింగ్ కు ప్రదీప్ డుమ్మా కొడుతున్నాడు. ఒకటి రెండు కాదు...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ టీవీ యాంకర్ ప్రదీప్ కేసు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. పోలీసు కౌన్సిలింగ్ కు ప్రదీప్ డుమ్మా కొడుతున్నాడు. ఒకటి రెండు కాదు ఐదు రోజుల నుంచి గైర్ హాజరవుతున్నాడు. తాము ఇచ్చిన గడువు లోపు ప్రదీప్ కౌన్సిలింగ్ కు హాజరు కాకపోతే వారెంట్ జారీ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే, షూటింగ్స్ బిజీ ఉండడం వల్లే రాలేకపోతున్నట్లు వీడియో మెసెజ్ పంపించాడు ప్రదీప్.

నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో పోలీసులు హైదరాబాద్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 45 లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ పట్టుబడ్డాడు. బ్రీత్ ఎన్లైల్జర్ టెస్ట్ లో 178 పాయింట్ లు రావడం తో పోలీసులు ప్రదీప్ పై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.

డిసెంబర్ 31 కేసు నమోదు చేసిన పోలీసులు జనవరి 2 తేదీ ఉదయం పది గంటలకు బేగం పేట్ లోని ట్రాఫిక్ ఇన్ స్ట్యూట్ లో నిర్వహించే కౌన్సిలింగ్ కి హాజరు కావాలి అని ప్రదీప్ కు నోటిసులిచ్చారు. అయితే, గత ఐదు రోజుల నుంచి ప్రదీప్ కౌన్సిలింగ్ కు డుమ్మా కొడుతున్నాడు. కాల్ చేసిన అందుబాటులోకి రాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రదీప్ పై అనేక ఆరోపణలు వచ్చాయి.

కౌన్సిలింగ్ కు గైర్ హాజరుపై ప్రదీప్ స్పందించి ఓ వీడియో మెసెజ్ పంపించాడు. తాను షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే కౌన్సిలింగ్ కి హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చాడు. పోలీసు కౌన్సిలింగ్ కు సహకరిస్తానని స్పష్టం చేశాడు. తాను అజ్ణాతం లో ఉన్నట్లు వస్తున్నా వార్తలు త్రోసిపుచ్చాడు. ఒకవేళ ప్రదీప్ కౌన్సిలింగ్ కి హాజరు కాకపోతే కోర్టు లో ఛార్జ్ షీట్ వేస్తామంటున్నారు పోలీసులు. ఆ తరువాత వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గత మద్యం కేసులను పరిశీలిస్తే ప్రదీప్ కు
మూడు నుండి ఐదు రోజులు పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories