వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రభోదానంద

x
Highlights

ప్రభోదానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది దేవుళ్లను ఆరాధించేవాళ్లు భక్తి వ్యభిచారులని అన్నారు. తాను శ్రీకృష్ణున్ని మాత్రమే...

ప్రభోదానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది దేవుళ్లను ఆరాధించేవాళ్లు భక్తి వ్యభిచారులని అన్నారు. తాను శ్రీకృష్ణున్ని మాత్రమే ఆరాధిస్తున్నానని భగవద్గీతను అనుసరిస్తున్నానని తెలిపారు. తమ ఆశ్రమంపై పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభోదానంద ఖండించారు. అదే విధంగా చిన్నపొలమడలో జరిగిన హింసాత్మక సంఘటనపై స్పందించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చిన పొలమడ వద్ద ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన హింసాత్మక సంఘటలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఎంపీ జెసి దివాకర్ రెడ్డి ప్రభోదానందపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా మరొకొందరు గుత్తి పోలీస్ స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభోదానంద మరోసారి స్పందించారు. తనపై కేసు విషయాన్ని కోర్టులే తేలుస్తాయని అన్నారు.

తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చింత్ర హింసల పాలు చేస్తున్నారని ప్రభోదానంద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించాలని కోరారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం జరిగిన రోజున హింసాత్మక సంఘటనలు జరగడం ఆ ఘటనలో కొందరు చనిపోవడానికి కారణం ఎంపీ జెసి దివాకర్ రెడ్డేనని ప్రభోదానంద ఆరోపించారు. హింసాత్మక ఘటనపై తన స్పందనను తెలియజేసిన ప్రభోదానంద తమ ఆశ్రమంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. తాను భగవద్గీత ప్రకారం నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. వేదాలన్ని వేదనలనే అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories