అందుకే పాదయాత్రలో పాల్గొన్నా: పోసాని

అందుకే పాదయాత్రలో పాల్గొన్నా: పోసాని
x
Highlights

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి...

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..‘జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను. అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది.

ఇది చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర. మూడు వేల కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేస్తున్న పాదయాత్ర అసాధారణం. నేను రెండు, మూడు కిలోమీటర్లు కూడా నడవలేకపోయా. సమస్యల పరిష్కారంపై నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారు.’ అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories