ఫస్ట్ ప్లేస్ లో వైసీపీ

x
Highlights

2017 ఏడాది ఎన్నో రకాలుగా గుర్తుండిపోతుంది ముఖ్యంగా రాజకీయ పార్టీలకి మరీను తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రంగు మారింది 2017 ఏ పార్టీకి కలిసొచ్చింది? ఏ...

2017 ఏడాది ఎన్నో రకాలుగా గుర్తుండిపోతుంది ముఖ్యంగా రాజకీయ పార్టీలకి మరీను తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రంగు మారింది 2017 ఏ పార్టీకి కలిసొచ్చింది? ఏ పార్టీ ఎదురు దెబ్బలు తింది? రాజకీయ చదరంగంలో పార్టీల పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

తెలుగు రాష్ట్రాల్లో 2017లో విపక్ష పార్టీలన్నింటిదీ పోరాట బాటే అయినా అందరికన్నా అత్యధిక పోరాటాలు చేసి వైసీపీ రికార్డు క్రియేట్ చేసింది. వైసీపీ చేసినన్ని పోరాటాలు బహుశా ఏ ప్రతిపక్షం చేయలేదంటే అతిశయోక్తి కాదు నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచిందా పార్టీ.. మిగతా విపక్షాలూ పోరాడినా.. క్రెడిట్ మాత్రం వైసీపీకే.. ఏ విపక్షం ఏం సాధించింది?

తెలంగాణలో కేసీఆర్ వార్ వన్ సైడ్ అన్న రీతిలో చెలరేగిపోతే ఆ ఆధిపత్యాన్ని అడ్డుకోడానికి విపక్షాలు మూడు చెరువుల నీళ్లు తాగాయి. ఈ ఎదురు దాడిలో టీ టీడీపీ దారుణంగా దెబ్బ తినగా టీ కాంగ్రెస్ మాత్రం నిలదొక్కుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కొత్త ఏడాదిలో తెలంగాణపై టీ-టీడీపీ ఉనికి ఉంటుందా అనే సందేహాలు రేగుతున్నాయి 2017లో తెలంగాణ విపక్షాల ట్రాక్ రికార్డ్ ఓసారి గుర్తు చేసుకుందాం.

తెలుగు రాష్ట్రాలు 2017లో చాలా సంయమనంతో ముందుకెళ్లాయి.. విభజన వివాదం సమసిపోగా ఇద్దరు చంద్రులు కాస్త ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే నడుచుకున్నారు.. అందివచ్చిన అవకాశాల్ని, నిధుల్ని పుష్కలంగా వినియోగించుకుని తెలంగాణ చంద్రుడు మెరిసిపోతే.. నిధుల్లేక.. నీరసించిన రాష్ట్రాన్ని ఏలడంలో బాలారిష్టాల మబ్బుల్లో చిక్కుకున్నాడు ఏపి చంద్రుడు.. 2017లో ఎవరేం సాధించారు?

Show Full Article
Print Article
Next Story
More Stories