కిడ్నీ కోసం చోరీ

x
Highlights

కిడ్నీ వ్యాధి భార్య ప్రాణం మీదికొచ్చింది. లక్షలు పోసినా రోగం నయం కానంది. ఉన్నదంతా ఊడ్చేసినా డాక్టర్లు ఇంకా కావాలన్నారు. చేసేదేం లేక భర్త దొంగగా...

కిడ్నీ వ్యాధి భార్య ప్రాణం మీదికొచ్చింది. లక్షలు పోసినా రోగం నయం కానంది. ఉన్నదంతా ఊడ్చేసినా డాక్టర్లు ఇంకా కావాలన్నారు. చేసేదేం లేక భర్త దొంగగా మారాడు. భార్య సాయంతో ఓ జ్యూయలరీ షాపును దోచుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన బంగారం షాపు దోపిడిని పోలీసులు ఛేదించారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం బీరంగూడలో ఈ నెల 3 న జరిగిన దోపిడిని పోలీసులు ఛేదించారు. దోపిడికి పాల్పడింది ఒరిస్సాకు చెందిన దంపతులని తేల్చారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మరింత ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ నెల 3 న బీరంగూడలోని జై భవానీ జ్యూయలరీ షాపులో బుర్కా వేసుకున్న మహిళతో పాటు మరో వ్యక్తి దోపిడికి పాల్పడ్డాడు. షాపులోని వ్యక్తిని చితక్కొట్టి మరీ సొమ్ముతో ఉడాయించారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 11 రోజుల తర్వాత కేసును ఛేదించారు.

విచారణలో దొంగ దంపతులు చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. వైద్య ఖర్చుల కోసమే దొంగతనానికి పాల్పడినట్లు దంపతులు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన సునీల్‌ మహతా, సునితా మహతా దంపతులు యేడాదిన్నర నుంచి హైదరాబాద్‌ అమీన్‌పూర్‌లోని మోడీ బిల్డర్స్‌ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం కొంతకాలంగా జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో భార్య సునిత చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం ఏడున్నర లక్షలు ఖర్చు కూడా చేశారు. కానీ వ్యాధి నయం కావాలంటే మరిన్ని డబ్బులు అవసరం కావడంతో దొంగతనమే శరణ్యం అనుకున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారం బీరంగూడలోని జ్యూయలరీ షాపును దోచుకోవాలని ప్లాన్ వేశారు. రెక్కీ కూడా నిర్వహించారు. టైమ్‌ ఫిక్స్‌ చేసుకుని దోపిడికి పాల్పడ్డారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు 5 బృంధాలుగా వీడిపోయారు. ఎట్టకేలకు కోల్‌కతా సమీపంలో వీరిని పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories